Monday, March 29, 2010

bharatam gutinchi

                            గణపతి స్తుతి
అంకముచేరి శైలతనయాస్తన దుగ్దములానువెళ బా
ల్యాంక విచేష్ట దొండమున నవ్వలిచన్ గబలింపబోయి యా
వంక కుచంబుగాన కహివళ్ళభ హారముగాంచి వే మృణా
లాంకుర శంక నంటెడు గజాస్యునిగొల్తు నభీష్టసిద్ధికిన్
ఇది అల్లసాని పెద్దన విరచితమైన మనుచరిత్ర ప్రతమశ్వసములోని నాలుగవ పద్యము
మహాభారతం గురించి రాస్తానని మనుచరిత్ర పద్యం ఏంటి అనుకుంటున్నారా ?ఇది నాకు ఇష్టమైన పద్యం .సంస్కృత శ్లోకం కన్నా సంస్కృత పదాలతో రాసిన తెలుగుపద్యం తో గణేషుని స్తుతిస్తే బాగుంటుందని తోచింది .ఇకనుంచి మీరుకూడా శుక్లాంబరధరానికి మారుగా పైన చెప్పిన పద్యంతో గణపతి ప్రార్థన చెయ్యండి .ఏందుకంటే సంస్కృత శ్లోకం గణపతిని మాత్రమే స్తుతిస్తే తెలుగు పద్యం గణపతిని అర్ధనారిశ్వరుడైన శివుని ,(అంటే అంబా సమేతుడైనశివుడు)శివ హరమైన సర్పాన్ని ప్రార్థించి్నట్లవుతుంది .
అంతేకాదు ,ఓమహా గణపతి నీవు బాల్యంలో తామర తూడని భ్రమించి సర్ప హారాన్ని ఏవిదంగా పట్టుకున్నవో అదేవిదంగా భ్రమలోమేము చేసే పొరపాట్లను మన్నించి మాకార్యలను నిర్విఘ్నం చెయ్యి అని వేడుకున్నట్లవుతుంది.
                                     తెలుగు గ్రంథంలో సంస్కృత శ్లోకం    
శ్రీ వానీగిరిజాశ్చిరాయ దధతో వక్క్షో ముఖాన్గేషుయే
లోకానాం స్థితి మావహంత్య విహతాన్ స్త్రేపున్సయోగోద్భావాన్
తే వేదత్రయ ముర్తాయ స్త్రిపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయసు:పుశోత్తమాంభుజభవ శ్రీ కందరా శ్రేయసే
ఇది తెలుగు మహా భారతంలోని తొలి శ్లోకం. శ్లోకం అంటే సంస్కృతమని మళ్లీచెప్పాల్సిన అవసరం లేదు .భాష మాత్రమే కాదు .యతి ప్రాస నియమాలుకుడా సంస్కృత సాంప్రదాయానుసారముగానే వదిలివేయబడ్డాయి .కావ్యాన్ని
"మ" గణం తో ప్రారంభించడం మంగలకరం
ప్రారంభన లోనే త్రిమూర్తి ప్రార్థన చేయడం నన్నయ క్రాంత దర్శనమునకు నిదర్శనం .మహాభారత రచన ముగ్గురిచేతుల మీదుగా పూర్తవుతుందని సూచించాడేమో.రుశివంటి నన్నయ రెండవ వాల్మికి అని విశ్వనాథ అన్నాడు

నన్నయ శబ్దం నారాయణ శబ్ద భావం :తిక్కన కవి బ్రహ్మ : ఎర్రన శంభు దాసుడు

త్రిమూర్తుల స్తుతితో ప్రారంభమైన భారతం కవిత్రయం చేతులమీదుగా పూర్తయింది .ఇది ఈ పద్యం ప్రత్యేకత
                                             నన్నయ కవితా లక్క్షనాలు
సారమతిం కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తిలో
నారసి మేలునా .నితరులక్క్షర రమ్యత నాదరింప ,నా
నా రుచిరార్త సూక్తినిది నన్నయ భట్టు తెనుంగునన్ మహా
భారత సంహితా రచన భండురుదయ్యే జగద్ధితంబుగన్
౧)ప్రసన్న కథా కలితార్థ యుక్తి
౨) అక్క్షర రమ్యత
౩)నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం
పైన చెప్పిన మూడు నన్నయ కవిత్వంలో కనిపించే ప్రధాన లక్క్షనాలు
క్రొత్తగా ఇల్లు కట్టించుకోవాలనుకునేవాడు తనింట్లో ఏర్పాటు చేసుకునే సౌకర్యాల గురించి ప్రణాలికలు వేసుకుంటాడు .
అన్ని నేర్వేరుతయ అంటే "హోటలుకు వెళ్లి పెసరట్టు ఆర్దరిచ్చినట్టే "తానడిగింది ఒకరకం పెసరట్టు వాదిచ్చింది మరోరకం పెసరట్టు .
నన్నయ రచన అలాన్టిదికాడు .తన రచనలో చుపుతానన్న గుణాలు చుపితీరాడు .
ఎ)ప్రసన్న కథా కలితార్థ యుక్తి :-మహా భారతంలో ఉపాఖ్యానాలు చాల ఎక్కువ .ఉపాఖ్యానాలు ఆఖ్యానానికి అడ్డుతగలకుండా ఆరెంటినడుమ వుండే సంబంధాన్నితెలిపి కథను ప్రసన్నం చేసేది. దీనికే
ప్రసన్న కథా కవితర్థ యుక్తి అని నామాంతరం.ఇది లోనారసి తెలుసుకొనే కవితగుణం సాహిత్యం ఆలోచనామృతం .తరచిచూసినాకొద్ది కొత్త కొత్త అర్థాలు భావాలు స్ఫురిస్తాయి ఈ ఆలోచనామ్రుతత్త్వానే నన్నయ ప్రసన్న కథా కలితార్థయుక్తి అన్నాడేమో అనిపిస్తుంది .ఇది కవీంద్రులు లోనారసి తెలుసుకునీ గుణం .
నన్నయ కథను చాలారకాలుగా ప్రసన్నం చేసాడు ఆయా పద్యాలూ చూసేప్పుడు పరిశీలిద్దాం.
బి) అక్క్షర రమ్యత :-అక్క్షరమ్ అంటే నాశనం లేనిది అని .రమ్యత అంటే సుందరమైనది అని .అందం, సౌందర్యం నశించేవికావు. ఇవి చూడగానే ఆట్టే మనసును ఆకర్షించి నిలిపివుంచేవి .అందాన్ని ఆస్వాదిన్చాలిఅంటే ఆట్టే పాండిత్యం అవసరంలేదు . కవీంద్రులు కానివారు(ఇతరులు) సహితం ఆనందించే కవితా గుణం .
సి) నానా రుచిరార్థ సుక్తినిధిత్వం :రుచిరమంటే రోచస్సు అన్టేకాంతి, వెలుగు సూక్తి అంటే సుష్టం ఉక్తం అని
స్తూలంగా చెప్పాలంటే మంచిమాట (సు +ఉక్తి) నన్నయ కవిత్వంలోని పద్యాలు సూక్తులు కావు ఆపద్యాల అర్థాలు తమ తేజస్సుతో సుక్తుల్ల భాషిస్థాయి .నన్నయ కవిత్వంలో సూక్తులు కథనుండి విడివడి నీతిపద్యాల్ల కనిపిస్తాయి .ఆపద్యలన్నింటిని ఏరి ఒకచోట రాస్తే నిర్మకుట నీతిశతకములా కనిపిస్తుంది.
నన్నయ తన కవిత్వ లక్క్షనాలుగా చెప్పిన వాటిని ప్రతిజ్ఙగా భావించి నెరవేర్చాడు

.

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. "కవిత్రయ భారతం" గురించి వివరణల కంటే కావలసినదేముంటుంది! సాహితీ ప్రియులకు విందే విందు. కానీ అక్షర దోషాలు చాలా ఉన్నాయి. దయచేసి సవరించమని మనవి.

    ReplyDelete