Monday, March 29, 2010

maha bharatam lokanipinche brahmana swaroopam

మహా భారతలో కనిపించే బ్రాహ్మణ స్వరూపము మేడిశెట్టి రవిచన్ద్ర తెలుగు పండిత్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల గ్రా:మార్చాల , జిమహబూబ్ నగర్
ప్రాచీన భారతీయ సమాజంలో బ్రాహ్మణులకు ప్రాదాణ్యత అధికం.తెలుగులో ఆదికావ్యమైన మహాభారతంలో ప్రకటితమైన విషయాలను గమనిస్తే ఆవిషయం ప్రస్పుటమౌతుంది.నిజంగా బ్రాహ్మణుడు భూసురుడేనా?అతనికి శాపానుగ్రహణ శక్తిఉందా?అనేవిశయాలు అప్రస్తుతాలు..ప్రస్తుతం అవాస్తవాలు.ఐతే ఒకకాలాన్ని మరోకాలపు దృష్టితో చూస్తే అంతా అయోమయంగానే అనిపిస్తుంది.మాతాత పుడుతూనే ముసలివాడు అన్నట్లుంటుంది.అసలుబ్రాహ్మణుడంటేఎవరు.?అనేప్రశ్నకు సమాధానం మొదలు తెలుసుకోవాలి.అప్పుడు విషయం బోధపడుతుంది.
చాతుర్వర్ణ్యం మయాసృష్ట్యా గుణకర్మవిభాగసః అనిగీతాకారుడన్నాడు.పుట్టుకతో ఎవరూ ఏమీకారు.,వారివారిగుణ కర్మలననుసరించి చాతుర్వర్ణాలు సృష్టించాను అని భావం.విద్యనేర్చినవాడు విప్రుడు వీర్యముండినవాడు క్షత్రియుడు అన్న గురజాడమాటలు గీతావాక్యానికి వ్యాఖ్యానప్రాయంగా నిలుస్తాయి.
ఆకాలంలో విద్య నేర్చినవాడు  బ్రాహ్మణుడు మాత్రమే కాబట్టి, విద్వాన్ సర్వత్ర పూజ్యతే కాబట్టి పూజించబడ్డాడు అంతే.
బౌద్ధ జైన మతాలప్రాబల్యంనుండి అప్పుడప్పుడే బయట పడుతున్న భారతీయ స్దమాజానికి మళ్ళిహైందవమే ఆరాధ్యమైంది.భగవమ్తునికి ప్రతినిధిగాఉండి పూజలందించడమే కాకుండా.జాతక కర్మ మొదలుకొని అపరకర్మలవరకుఅన్నీ ముందుండి జరిపించే బ్రాహ్మణుడు పూజనీయుడైనాడు.అందనంత ఎత్తున అతని స్తానం ఏర్పాటుచేయ బడింది.ఆఎత్తును బేరీజువేసెప్రయత్నమే ఈవ్యాసం.
భారతాన్ని తెనుగున రచింపమని రాజరాజు నన్నయను కోరడంలో భాషాభిమానంకన్నా మతాభిమానం అదికమనిపిస్తుంది.ఇతర భాషలలో ఆనాటికే ఉద్భవమందిన సాహిత్యం జైన బౌద్ధమతాల పాదునుండిఉధ్భవమందిందే.వైదికమతాభిమానిఐన రాజరాజుకిది నచ్చలేదు.అందుకే తనువినాలనుకున్న తనపూర్వులచరిత్రరచనకు నన్నయనుఎన్నుకున్నాదు.
(ఆదిపర్వము ప్రథమాశ్వాసము ౯వ పద్యం "తనకుల బ్రాహ్మణు.......కరుణతోడ" ఆదారంగా)
నన్నయ విపుల శబ్దానుశాసనుడు,సంహితాభ్యాసుడు,బ్రహ్మండాది నానాపురాణ విజ్ఞాననిరతుడు,ఉభయభాషాకావ్య రచనా శొభితుడు. ఐనప్పటికి రాజరాజు కుల బ్రాహ్మణుడుకావడముచేతనే మహాభారత రచనావకాశం లభించింది.(వాగనుశాసనుడైన నన్నయ మరోలా మొదలు పెట్టలేకకాదు "తనకుల బ్రాహ్మణు "అని మొదలు పెట్టింది .తను బ్రాహ్మణుడుకావడం వల్లనె నానా పురాణ విజ్ఞాననిరరుడుకాగలిగాడు,అందుకే ఉభయ భాషారచనా కోవిదుడుకాగలిగాడు.అందుకేమహాభారత రచనావకాశం లభించింది. అందుకే ఆపద్యాన్ని తనకుల బ్రాహ్మణు అని మొదలు పెట్టాడు.ఇదే ప్రసన్నకథా కళితార్థయుక్తి.
ఇంతకి రాజరాజు మహాభారతమే ఎందుకు వినాలనుకున్నాడు.పాండవులు తనపూర్వికులు కనుకేనా.అంత మాత్రమేకాదు,అమల సువర్ణశృంగకురమై కపిలంబగు గోశతంబు ఉత్తమ బహువేదవిప్రులకు దానంచేస్తే ఎంతఫలం వస్తుందో ,మహాభారతం వినడంవల్ల అంతఫలితం వస్తుందట.అదికే భారతం వినాలనుకున్నాడు.అదీసంగతి.
ఇక కథలోకి వస్తే !
మహా భారతంలో మొదట కనిపించే కథ ఉదంకోపాఖ్యానం.ఇది పూర్తిగా సంకేతాత్మికమైంది. అక్షరాక్షరం  ప్రసన్న కథాకలితార్థయుక్తితోకూడుకున్నది.
ఆకథను ప్రసన్నం చేయడానికి ఇది వేదిక కాదు కాని ,దానిలోగల బ్రాహ్మణత్వాన్ని పరిశీలిద్దాం.పౌశ్యోదంకులు శాపప్రతిశాపాలు ఇచ్చుకున్న తర్వాత పౌశ్యుడు తనకు శాపాన్ని ఉపసంహరించేశక్తిలేదని చెప్పిన నిండుమనంబునవ్యనవనీతసమానముఅనే  పద్యంలో నన్నయ ఉదంకునిరూపంలో అందనంత ఎత్తునుంటే,  వినమ్రంగా చేసులుముడుచుకొని తలవంచుకొని నిలబడ్డ పౌశ్యునిలో రాజరాజు కనిపిస్తాడు.
                                   *           *                 *
నీవతి కౄరుడవు సర్వ భక్షకుడవు కమ్మని శపింఇన బృగువుతో అగ్ని......

అడచిన దిట్టిన మహాపరుషంబులు పల్కి యల్కతో
బొడిచిన నుత్తమద్విజులు పూజ్యులు వారలకెగ్గుసేసినం
జెడునిహముంపరంబు సిద్ధంబుగావుటెరింగి భక్తి నె
ప్పుడు ధరణీసురోత్తముల బూజలదన్పుదు నల్గనోడుదున్     అంటాడు.
పై పద్యంలో చెప్పింది అగ్నిదేవుని అభిప్రాయం కాదు రాజరాజు అభిప్రాయం.\
గొంతుదిగని బ్రాహ్మణుడు
 మాతృదాస్య విముక్తికొరకు బయలుదేరిన గరుత్మంతుడు తనజు ఆహారం ప్రసాదించమని తల్లిని వేడుతాడు.అడిగాడుకాబట్టి ఆయమ్మ తనకుమారునికి ఆహారం చూపింది,ఏమిటి ఆ ఆహారం?సముద్రంలో అసంఖ్యాకంగాఉన్న నిషాదులను ఆహారంగా పరిగ్రహించమని చెప్పింది.పొరపాటునకూడా బ్రాహ్మణున్ని తినవద్దంది.పాపం నిషాదులు చేసిన పాపం ఏమిటి? విషనిదినున్న నిషాదులు ధారుణి ప్రజను విషమము చేస్తున్నారట.అందుకని వారిని తినమన్నది.
సరేగాని గరుత్మంతుడు అయోమయంలో పడిపోయాడు.బ్రాహ్మణూల్ని గుర్తించడమెలా?అదేవిషయం తల్లినడిగాడు. దానికి ఆయమ్మ ఇలా చెప్పింది.
రయమున మ్రింగుడు గాలము
క్రియ నెవ్వడు కంఠవిలము క్రిందికి జనక
గ్నియ పోలె నేర్చుచుండును
భయరహితా వానినెరుగు బ్రాహ్మణకులుగాన్ (ఆది ద్వి ఆ ౮౧)
ఎవరిని మ్రింగితె గొంతుదిగకుండా అడ్డుపడి అగ్నిలాకాలునోఅతనే బ్రాహ్మణుడు.అలాంటివాన్ని మింగకూడదని చెప్పి,ఇంకా ఇలా అంటుంది.
వినత చెప్పిన బ్రాహ్మణ స్వరూపం
 బ్రాహ్మణున్ని ఎలా గుర్తించాలొ చెప్పిన వినత అంతటితో ఆగలేదు.బ్రాహ్మణున్ఇ ఎందుకు ఆహారంగా స్వీకరించకూడదో కూడా వివరించింది.
కోపితుండైన విప్రుడు ఘోరశస్త్ర
మగు మహావిషమగు నగ్నియగు నతండ
యర్చితుండైన జనులకు నభిమతార్థ
సిద్ధి కరుడగు గురుడగు  చెయుప్రీతి (ఆది ద్వి ఆ ౬౨)
ఆందుకే బ్రాహ్మణున్ని పూజించాలి ,కాని మ్రింగకూడదు.
        ఇంగువ కట్టిన గుడ్డ      
సరే గరుత్మంతుడు బయలు దేరాడు.సముద్రగర్భంలోనున్న నిషాదులందరిని ఒక్క పెట్టున మ్రింగాడు.అందులో ఒక్క బ్రాహ్మణుడుండి గొంతుకు అడ్డుపడ్దాదు .వైనతేయునికి తల్లిమాటలు జ్ఞప్తిజివచ్చాయి.నాగొంతులో ఎవరినా బ్రాహ్మణుడుంటే బయటికిరావలసిందని ప్రార్థించాడు.
విప్రుడనున్నవాడ,నపవిత్ర మదీయభార్య కీ
       ర్తిప్రియ !దీనిబెట్టి చనుదెంచుట ధర్మువెనాకు?     అని సమాధానం వచ్చింది
ఆహా ఈబ్రాహ్మణుడెంత ధర్మపరుడు.తన భార్యతోపాటు తానుకూడ నా జఠాగ్నిలోపడి పతీసహగమనం చేద్దామనుకుంటున్నాడని చింతించి,
విప్రుల బొందియున్న యపవిత్రులు బూజ్యులుగారె కాదునన్
విప్రకులుండ వెల్వడుము వేగమ నీవును నీనిషాదియున్   (ఆది ద్విఆ ౬౪)
అని వారికి  స్వేచ్ఛను ప్రసాదించాడు.ఇంగువకట్టిన గుడ్డకు వాసన వెసినట్లు బ్రాహ్మణుని(జ్ఞానిని) పొందియున్న అపవిత్రులు(అజ్ఞానులు)సహితం పుణ్యాత్ములవుతారట!అందుకే విప్రుని భార్యయైన నిషాదికి విముక్తి లభించింది.
నిర్మానుష్యం కానక్కరలేదు 
     మొత్తానికి గరుత్మంతుడు నిషాదులను ఆహారంగాస్వీకరించి బయలుదేరాడు,కాని ఆకలితీరినట్టులేదు.తండ్రిఐన కశ్యపుని దగ్గరకు వెళ్ళాడు,నమస్కరించాడు,నిషాదులను తినడంవల్లనాకు ఆకలి తీరలేదు,నాకు ఆహారాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు.కొడుకు కడంకకు మెచ్చి గజకూర్మ రూపాలలోనుండి అర్థనిమి్త్తంపోరుచున్న విభావసుడు,సుప్రతీకుడు అను సోదరద్వయాన్ని ఆహారంగా పరిగ్రహించమని ఆదేశిస్తాడు.
గజ కూర్మాలను చెరోచేత్తోపట్టుకొని ఆకాశంలోకి ఎగిరిన గరుత్మంతుని అలంబన తీర్థంలోని శతయోజనవిస్తీర్ణంగల రోహనంబను వృక్షం తనపై కూర్చొని వాటిని ఆరగించమని కోరుతుంది.గరుడూని భారాన్ని మొయలేక తరుశాఖ విరిగిపోతుండగా,దాఇఆదారంగా తపస్సు చేసుకుంటున్న వాలాఖీల్యులను చూసి,ఆశాఖభూమిని తాకిన వారికి బాధకలుగునని ఆకొమ్మను పట్టుకొని తండ్రివద్దకి వెడుతాడు.కశ్యపుని ప్రార్థనతో వాలాఖిల్యులు ఆతతుశాఖ వీడి హిమవన్నగ ప్రాంతానికి వెలతారు.
మునిజన రహితంబైన ఆతరుశాఖను ధరిణీసుర విరహితంబైన చోట వదిలివేస్తానని,అలాంటిచోటు చూపుమనగా,హిమశైల కందర భాగమున నిష్పురుషనగముకలదు అచ్చటవదిలి వేయమని చెపుతాడు కశ్యపుడు.
  ఆ శాఖ వదలి అమృత హరణార్థంవెలుతాడు గరుడుడు  (ఇందులో ఏదోలోపించినట్లనిపిస్తుంది )
            శర్మిష్ట _దేవయాని
రాజెక్కువా? మొండెక్కువా? అంటే  మొండే ఎక్కువ అని సామెత.మొండేకాదు బ్రాహ్మణుడుకూడా రాజుకన్నా అదికుడే.ఒక్కమటలో చెప్పాలంటే చరాచర జీవరాసిలో బ్ర్మాహ్మణుడే అధికుడు.ఆ ఆధిక్యానికి కారణం అతనివిద్యే.ఆవిశయాన్ని స్పష్టంచేసే ఉపాక్యానమే శర్మిష్ట దేవయాని.
శర్మిష్ట వృషపర్వుడానే దానవరాజు కూతురు.వారికులగురువు శుక్రాచార్యుని కూతురు దేవయాని.శర్మిష్ట ,దేవయానులిరువురు క్రీడాసఖులు.వీరొకనాడు చెలులతోకలసి క్రీడార్థమై  వనమునకేగి అందొక సరోవర తటమున పుట్టంబులబెట్టి జలక్రీదలాడుచుండగా సురకరువలిచే వస్త్రాలన్ని కలసిపోగా దేవయాని వస్త్రాలు శర్మిష్ట కట్టుకుంటుంది,కాని శర్మిష్ట వస్త్రాలు దరించనిరాకరించిన దేవయాని
లోకోత్తర చరితుడగు
నాకవ్యు తనూజ నీకునారాధ్యను నే
బ్రాకట భూసురకన్యక
నీకట్టిన మైలకట్ట నేర్తునె చెపుమా (ఆది తృ ౧౩౫)
అని అంటుంది.దీనికి కోపించిన శర్మిష్ట
మాయయ్యకు బాయక పని
సేయుచు సేవించి ప్రియము సేయుచు నుండున్
మీయయ్య యేటిమహిమలు
నాయొద్ద పలుకనీకునాయములేదే(ఆది తృ ౧౩౭)
అనితిట్టి దేవయానిని నూత పడదోసి వెళ్ళిపోతుంది .
యయాతిరావడం దేవయానినుద్దరించడం వేరుసంగతి,అసలు సంగతి చారులద్వారాతెలుసుకున్న వృషపర్వుడు శుక్రాచార్యునిదగ్గరకువచ్చి
నమస్కరించి ఇట్లా అంటాడు.
దేవతలన్ జయించుచు నతిస్థిర సంపదలంద్వదీయవి
ద్యావిభవంబు పెంపున దానవు లుద్దతులైరి;కానినా
డీవనరాసిలో జొరరె యింతకు నంతక కోపులైన య
ద్దేవతాకినీపతుల దివ్య నిశాత మహాయుదహతిన్ (ఆది తృ ౧౫౧)

వరణ ఘోటకభాండా
గారంబులు మొదలుగాగ గల ధనములతో
సూరినుత!యిందరము నీ
వారకములుగాగ మమ్ము వగవుము బుద్దిన్ (ఆది తృ ౧౫౨)
ఈ దేవయానికేదిష్టమో దానినిస్తాను అడగమంటే,కన్యాసహస్రంబుతో శర్మిష్ట నాకుదాసి కావాలి అని దేవయాని కోరుతుంది.దానికివడంబడి వృషపర్వుడు తనకూతురిని దేవయానికి దససిగ అప్పగిస్తాడు.
ఈకానుక శుక్రాచార్యుని విద్యా విభవానికి దాసోహమని ఇచ్చిందే కాని మరొకటికాదు.

No comments:

Post a Comment